: మూడేళ్ల పాలనలో భయంకరమైన అవినీతి జరిగింది: అంబటి రాంబాబు ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరిగిందని ఆరోపించారు.
మరోవైపు రాష్ట్రంలోని అవినీతి అధికారుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు అంటున్నారని, అయితే కేవలం అధికారులే అవినీతికి పాల్పడుతున్నారా? అని ఆయన అడిగారు. టీడీపీ ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, మరోవైపు అవినీతిని అణచివేయాలని ఆయనే అంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్‌లు అవినీతికి చిరునామాగా మారిపోయారని ఆయన ఆరోపించారు. వచ్చేనెల 1, 2వ తేదీల్లో గుంటూరులో తమ పార్టీ అధినేత రైతుల కోసం దీక్షకు దిగుతారని, రైతుల సమస్యలపై గళం విప్పుతారని ఆయన తెలిపారు.