: విద్యాసాగర్‌ రావు మృతి పట్ల దత్తాత్రేయ దిగ్భ్రాంతి


ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ మరణ వార్త తననెంతగానో బాధించిందని అన్నారు. వ్యక్తిగతంగా తాము ఎన్నోసార్లు కలిసి ఆలోచనలు పంచుకున్నట్టు ఆయ‌న తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే కాక‌ వచ్చాక కూడా ఆయ‌న చేసిన కృషిని మంత్రి అభినందించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలుగు ప్రజలకు అన్యాయం జరగకూడదని ఆయ‌న‌ పోరాటం చేశార‌ని చెప్పారు. ఆయ‌న‌లో జాతీయ దృక్పథం అధికంగా ఉంద‌ని అన్నారు. దేశంలో నదుల అనుసంధానం, ప్రాజెక్టుల ప్రయోజనాల విషయంలో ఆయన సేవలు అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News