: ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావచ్చు: రికీ పాంటింగ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సామర్థ్యంపై సందేహాలను వ్యక్తం చేస్తూ, విమర్శిస్తున్నవారి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఒక గొప్ప క్రికెటర్ అని... ఒక ఛాంపియన్ ఆటగాడి గురించి తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. అయితే, వయసు పెరుగుతున్న రీత్యా ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని... వచ్చే ఏడాది ఆడకపోవచ్చని తెలిపాడు. ఎన్ని ఘన విజయాలు సాధించిన ఆటగాడికైనా... కెరియర్ లో ఓ క్షీణ దశ ఉంటుందని చెప్పాడు. తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని తెలిపాడు.