: హ్యాట్సాఫ్ రాజమౌళి.. ‘బాహుబలి-2’ అంచనాలను మించి దూసుకెళ్తోందంటూ మహేష్ బాబు స్పందన


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రంపై సినీ అభిమానులు, న‌టులు, క్రికెట‌ర్లు, ద‌ర్శ‌కులు ఎంతో మంది ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రిన్స్‌ మహేష్ బాబు కూడా బాహుబలి సినిమా బృందాన్ని అభినందించాడు. ద‌ర్శ‌కుడు రాజమౌళి కథ చెప్పడంలో మాస్టర్ అని ఆయ‌న అన్నాడు. బాహుబలి 2 అంచనాలను దాటేసి దూసుకెళ్తోంద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 'హ్యాట్సాఫ్ రాజమౌళి, బాహుబలి టీమ్' అని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరుపై టాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక్క‌డైన‌ ఎన్టీఆర్ కూడా ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ తారలంతా ఈ చిత్రాన్ని అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.





  • Loading...

More Telugu News