: సుందర్ పిచాయ్ కు గూగుల్ భారీ నజరానా!
టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ సీఈవో, భారతీయుడైన సుందర్ పిచాయ్ కు ఆ సంస్థ నుంచి భారీ నజరానా దక్కింది. 2016 సంవత్సరానికి గాను 198.7 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును పిచాయ్ కు ఇచ్చింది. గత ఏడాది ఈ అవార్డు కింద 99.8 మిలియన్ డాలర్ల నజరానాను అందించింది. పనితీరును బట్టి ఈ అవార్డును ఇస్తారు.
మరోవైపు 2016 సంవత్సరానికి గాను 6.5 లక్షల డాలర్ల జీతాన్ని పిచాయ్ అందుకున్నారు. 2015లో ఈ కంపెనీ సీఈవోగా బాధ్యతలను చేపట్టిన పిచాయ్ కంపెనీని లాభాల బాటలో పరుగులు పెట్టించారు. ముఖ్యంగా యూట్యూబ్, యాడ్ విభాగాల బిజినెస్ బాగా పెరిగింది. అంతేకాదు, 2016లో గూగుల్ నుంచి స్మార్ట్ ఫోన్ కూడా విడుదలైంది.