: భార్యను ఇంట్లోంచి గెంటేశాడు... తర్వాత స్పీడ్ పోస్టు ద్వారా ‘తలాక్’ చెప్పేశాడు!
భారత్‌లో త్రిపుల్ తలాక్ కేసులు ఎక్కువయిపోతున్నాయి. భార్యకు వాట్సప్, పోస్టు ద్వారా తలాక్ చెప్పేసి గుడ్ బై అనేసి, మరొకరిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిపోతున్నారు. ఇటువంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భార్యకు స్పీడ్ పోస్టులో త్రిపుల్ తలాక్ పంపించి, ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఓ భర్త.
ఆ రాష్ట్రంలోని అమ్రోహాలో ఉంటున్న ఓ ముస్లిం మహిళ ఈ ఘటనపై స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. పెళ్లయ్యాక తన భర్త తనతో నాలుగైదు నెలలు బాగానే వున్నాడని, అనంతరం కట్నం కావాలంటూ వేధించాడని, ఇంట్లోంచి గెంటేశాడని ఆమె వాపోయింది. ఇప్పుడిలా వదిలించుకోవాలని చూస్తున్నాడని కన్నీటిపర్యంతమవుతోంది.