: మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. ట్రంప్ ఆగ్రహం


అగ్రదేశం అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. అయితే, ఈ ప్రయోగం విఫలమైందని... క్షిపణి ఉత్తర కొరియా భూభాగాన్ని దాటి వెళ్లలేదని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఈ క్షిపణి మీడియం రేంజ్ కు చెందిన కేఎన్-17 అని తెలిపింది. ఈ క్షిపణితో ఉత్తర అమెరికాకు ఎలాంటి ప్రమాదం లేదని ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ అధికారులు తెలిపారు.

మరోవైపు, తన హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని చేపట్టడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష ద్వారా చైనా నమ్మకాన్ని, ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఉత్తర కొరియా అగౌరవపరిచిందని అన్నారు. 

  • Loading...

More Telugu News