: విమానాశ్రయంలో అనుమానాస్పద సూట్‌కేసులు.. భద్రత కట్టుదిట్టం
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పలు చోట్ల అనుమానాస్పద సూట్‌కేసులు కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ నిర్వీర్య టీమ్, జాగిలాల సాయంతో సూట్‌కేసులను స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. కారు పార్కింగ్ ప్రాంతంతో పాటు మరో రెండు చోట్ల పలు సూట్‌కేసులు కనిపించాయి. వాటిని గమనించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారే సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్టు అంతటా భద్రతను కట్టుదిట్టం చేసిన సిబ్బంది, ఆ సూట్‌కేసుల్లో ఏముందనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.