: వరంగల్ కలెక్టర్ కానుక... అధికారులంతా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' చూసేశారు!


వరంగల్ జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ కోసం అహర్నిశలు శ్రమించిన జిల్లా అధికార బృందానికి కలెక్టర్ ఆమ్రపాలి 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా టికెట్లను బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో ఎమ్మార్వో ఏషియ‌న్ మాల్‌ లో టికెట్లు బుక్ చేశారు. ప్లీనరీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సమస్యలు పరిష్కరించిన అధికారులకు టోకెన్ల రూపంలో టికెట్లు అందించారు.

జాయింట్‌ కలెక్టర్లు దేవానంద్‌, హరిత, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఈ సినిమాను వీక్షించారు. టోకెన్ తీసుకున్నవారు ధియేటర్ కు వెళ్లి డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు. ఈ సమయంలో టోకెన్లు ఎక్కువ జారీ కావడంతో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ... రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించారు. దీంతో వరంగల్ ఉద్యోగులు ప్రతిష్ఠాత్మకమైన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను ఆనందంగా వీక్షించారు. 

  • Loading...

More Telugu News