: 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్న అటవీ సిబ్బంది


తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ లో కలకలం రేపిన 12 అడుగుల కింగ్ కోబ్రాను ఎట్టకేలకు అటవీ సిబ్బంది బంధించారు. తమిళనాడు టీ ప్లాంటేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధీనంలో ఈ టీ ఎస్టేట్ ఉంది. తోటలో పని చేస్తున్న పనివారు... ఈ భారీ కింగ్ కోబ్రాను చూసి భయకంపితులయ్యారు. తోట నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, పాములు పట్టడంలో నిష్ణాతులైన సిబ్బందితో అధికారులు అక్కడకు వచ్చారు. అయితే పాము కోసం వారు ఎంత వెతికినా అది వారికి కనిపించలేదు. దాదాపు కిలో మీటర్ దూరం వరకు దాని కోసం గాలించారు. చివరకు ఓ ప్రాంతంలో మేకను ఉంచిన బోనులో కింగ్ కోబ్రా చిక్కుకుంది. దాన్ని పట్టుకుని గూడలూర్ అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది వదిలేశారు. దీంతో, టీ తోటలో పని చేస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. 

  • Loading...

More Telugu News