: 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' @ 1000 కోట్ల వసూళ్లు ఎలాగంటే...!


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. ఆ లెక్కలు ఎలాగంటే... ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో సింహభాగం పట్టణల్లోనే... ఇందులో కూడా పెద్ద స్క్రీన్లలోనే ఈ సినిమా ఎక్కువ షోలు ప్రదర్శితమవుతోంది. ఈ లెక్కన ఒక్కో ధియేటర్ కు 200 సీట్లు ఉన్నాయని భావించినా మొత్తం సీట్ల సంఖ్య 18,00,000 అవుతుంది. ఆ ప్రకారం ఒక్కో టికెట్ పై సరాసరి ధర 50 రూపాయలు వేసుకున్నా ఒక షోకు వసూలయ్యేది 9 కోట్ల రూపాయలు.

ఇలా రోజుకు ఐదు షోలు ప్రదర్శితమవుతున్నాయి. అంటే రోజూ ఈ సినిమాకయ్యే వసూళ్లు 45,00,00,000 రూపాయలు. ఈ లెక్కన వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి మల్టీప్లెక్స్ ధియేటర్లలో 150 రూపాయలు థియేటర్లలో కూడా 80 రూపాయల టికెట్లు ఉన్నాయి. దీంతో ఏ లెక్కన చూసినా వెయ్యి కోట్ల క్లబ్ ను భారత్ లో ఓపెన్ చేసేది 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాయేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News