: టాపార్డర్ బాదడంతో సత్తా చాటిన సన్ రైజర్స్


సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఈ సీజన్ లో తొలిసారి ప్రత్యర్థి గడ్డపై విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై సన్ రైజర్స్ టాప్ బ్యాట్స్ మన్ దూకుడు ప్రదర్శించడంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51), శిఖర్ ధావన్ (77) లిద్దరూ అర్ధసెంచరీలతో శుభారంభం ఇచ్చారు. వారిద్దరి తరువాత కేన్ విలియమ్సన్ (54) అర్ధసెంచరీతో ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

అనంతరం 208 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ గుప్టిల్ (23) త్వరగానే పెవిలియన్ చేరగా, వోహ్రా (3) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ (84) ధాటిగా ఆడాడు. బౌండరీల మోత మోగించాడు. అయితే మ్యాక్స్ వెల్ (0), మోర్గాన్ (26), సాహా (2), అక్షరపటేల్ (16), అనురీత్ (16), మోహిత్ శర్మ (2), ఇషాంత్ శర్మ (5 నాటౌట్) ఆకట్టుకోలేకపోవడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో 26 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమిపాలైంది. 

  • Loading...

More Telugu News