: హైదరాబాదులో బాహుబలి నగల ప్రదర్శన!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడో అందరికీ తెలిసిపోయింది. కానీ, ఆ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు జనాలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని తారాగణం ఉపయోగించిన ఆభరణాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఆభరణాలను రూపొందించిన అమ్రపాలి సంస్థ... హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తమ షోరూమ్ లో ఈ ఆభరణాలను ప్రదర్శించింది. నిన్న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దాదాపు 1000 ఆభరణాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ కవిత మాట్లాడుతూ, సినిమా స్టైలిస్ట్ లు రమా రాజమౌళి, ప్రశాంతిల సూచనల మేరకు ఈ ఆభరణాలను తీర్చిదిద్దామని తెలిపారు. తమ డిజైనర్లు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మీరాలు వీటిని రూపొందించారని చెప్పారు.