: లాలూ కుటుంబం క్విడ్ ప్రోకో.. భూములు ఇచ్చినట్టు ఒప్పుకున్న కేంద్ర మాజీ మంత్రులు


లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం క్విడ్ ప్రోకో బాగోతానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. లాలూ కుటుంబానికి తాము భూములు ఇచ్చామని కేంద్ర మాజీ మంత్రులు రఘునాథ్ ఝా, కాంతి సింగ్ లు చెప్పడంతో... అందరూ షాక్ కు గురయ్యారు. అయితే వాళ్లు భూములు ఇవ్వడం నిజమేనని... కానీ, అది క్విడ్ ప్రోకో కాదని లాలూ సన్నిహితులు చెబుతున్నారు.

యూపీఏ-1 హయాంలో తమకు కేంద్ర మంత్రి పదవులు ఇప్పించినందుకు వాళ్లిద్దరూ లాలూ కుటుంబానికి భూములు ఇచ్చారంటూ బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భూమి ఇచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర మాజీ మంత్రులు ఇద్దరూ ఒప్పుకున్నారు. పాట్నా జిల్లాలోని దానాపూర్ గ్రామంలో ఎకరా భూమిని లాలూ సతీమణి రబ్రీదేవికి 2006లో లీజుకు ఇచ్చామని... ఆర్వాత 2010లో అదే భూమిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించామని కాంతి సింగ్ తెలిపారు.

అయితే ఈ విషయాన్ని సుశీల్ కుమార్ మోదీ ఖండించారు. రబ్రీకి అమ్మిన భూమి చాలా చిన్నదని... ఆ భూమి పక్కనే ఉన్న భూమిని కారుచవకగా లాలూ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ లకు ఇచ్చేశారని చెప్పారు. మరోవైపు రఘునాథ్ ఝా కుమారుడు అజిత్ కుమార్ ఝా కూడా తన తండ్రి పేరుతో ఉన్న ఒక ప్లాటును 2005లో లూలూ కుటుంబానికి బహుమతిగా ఇచ్చినట్టు తెలిపాడు. అయితే ఇదంతా వ్యక్తిగత వ్యవహారమని... తమ భూమిని తమకు నచ్చిన ఎవరికైనా ఇచ్చే అధికారం తమకు ఉందని... ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News