: పక్షవాతంతో చావు బతుకుల మధ్య ఉన్న దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు!


కుడివైపు శరీరానికి పక్షవాతం సోకి పాకిస్థాన్ పరిధిలోని కరాచీలో ఉన్న ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఈ ఉదయం గుండె పోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కిడ్నీలు వైఫల్యం చెంది, చాలా రోజుల నుంచి డయాలసిస్ తో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పక్షవాతం, ఆపై గుండెపోటుతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, వెంటనే కోలుకునే అవకాశాలు లేవని, తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, 24 గంటలు గడిస్తేగాని ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News