: ఇండియన్ సినిమా ఇక 'బీబీ' అండ్ 'ఏబీ': వర్మ ఆసక్తికర ట్వీట్
రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్లు చేశాడు. తొలి రోజునే మెగా డైనోసార్ సత్తా చాటిందని, అందరు ఖాన్ లు, రోషన్ లు, చోప్రాల కన్నా తానే గొప్పని రాజమౌళి నిరూపించారని, అతన్ని కనుగొన్నందుకు కరణ్ జొహార్ కు తన సెల్యూట్ అని చెప్పాడు.
రాజమౌళి వంటి వజ్రాన్ని గుర్తించిన కరణ్ జొహార్ తెలివి తేటలకు 'బాహుబలి'ని ఇష్టపడే భారతీయులు పాదాభివందనం చేయాలని అన్నాడు. ప్రపంచం బీసీ అండ్ ఏడీ (క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం)లా భారత సినిమా ఇక 'బీబీ అండ్ ఏబీ' (బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి)గా మారనుందని అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్ 'బాహుబలి 2' ప్రభంజనంతో వణికిపోతున్నారని అన్నాడు.
Like world was divided into BC and AD (before death of Christ nd after ) Indian cinema is going to be BB and AB(before Bahubali and after)
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2017