: 2017లో తొలి మూడు నెలల్లో దేశంలో అమ్ముడైన స్మార్ట్ఫోన్లు ఎన్నో తెలుసా?
భారత్లో స్మార్ట్ హవా కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఏకంగా 2.70 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు కెనాలిస్ అనే సంస్థ పేర్కొంది. భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ 12 శాతం వరకు అభివృద్ధి సాధించినట్టు ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. భారత్ మార్కెట్లో శామ్సంగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా షియో రెండో స్థానానానికి దూసుకొచ్చింది. గతేడాది 3 శాతం వాటా కలిగిన షియోమీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏకంగా 14 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఇక కెనాలిస్ జాబితాలో మూడో స్థానాన్ని చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో దక్కించుకోగా, లెనోవో, ఒప్పో నాలుగైదు స్థానాల్లో నిలిచాయి.