: ఆన్ లైన్ లో కొన్న టీవీ మొరాయించింది... 50,000 నష్టపరిహారం చెల్లించమన్న ఫోరం!


ఆన్‌ లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన టీవీ పని చేసేందుకు మొరాయించడంతో... ఆన్ లైన్ సంస్థకు న్యాయస్థానం జరిమానా విధించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని చిత్తిరైమేడు ప్రాంతానికి చెందిన జీవానందం అనే రైతు 2015లో ఆన్‌ లైన్ ద్వారా 19,500 రూపాయలకు ఒక టీవీని కొనుగోలు చేశాడు.

అయితే ఇంటికి చేరిన టీవీ పని చేసేందుకు మొరాయించింది. దీంతో జీవనందం కాంచీపురంలోని ఆ బ్రాండ్ టీవీ సర్వీస్‌ సెంటర్‌ మరమ్మతుల కోసం తీసుకెళ్లారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన టీవీతో తమకు సంబంధం లేదని చెబుతూ, దానిని రిపేర్ చేసేందుకు అక్కడి మెకానిక్ 13,000 రూపాయలు డిమాండ్‌ చేశాడు. దీంతో తాను కేవలం 19,500 రూపాయలకే మంచి టీవీ వచ్చిందని భావిస్తే... ఈ రిపేర్ ఖర్చుతో కలిపి మొత్తం 32,500 అయ్యేలా ఉందని ఆందోళన చెందిన ఆయన, 2016 ఫిబ్రవరి 19న చెంగల్‌ పట్టులోని వినియోగదారుల ఫోరం లో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆన్ లైన్ సంస్థదే తప్పు అని నిర్ధారించి, బాధితుడు జీవనందంకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News