: కశ్మీర్ లో బ్యాంకు దోపిడీకి విఫల యత్నం చేసి, పట్టుబడ్డ ఉగ్రవాది


జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు బరితెగించారు. గతంలో పాకిస్థాన్ నుంచి నిధులు అందుకునే ఉగ్రవాదులు కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుండడానికి తోడు... ఆన్ లైన్ మళ్లింపులను వేయికళ్లతో గమనిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాక్ నుంచి నిధులు తెచ్చుకోవడం కంటే భారతీయ బ్యాంకులను కొల్లగొట్టడమే మేలు అన్న నిర్ణయానికి ఉగ్రవాదులు వచ్చారు. దీంతో అనంతనాగ్‌ జిల్లాలోని జమ్మూకశ్మీర్ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. బ్యాంకును సమీపించిన ఉగ్రవాదులు దానికి రక్షణగా వున్న సీఆర్పీఎఫ్ జవానును కాల్చారు. దీంతో ఆయన గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా, ఇంకొక ఉగ్రవాది పరారయ్యాడు. అతనిని భద్రతా బలగాలు విచారిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News