: అనంతపురం విషాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువులో పుట్టి మునిగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మరణించిన దుర్ఘటనపై జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మరణించడం బాధాకరంగా ఉందని అన్నారు. వారి మరణానికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాద దృశ్యాలు గుండెలు పిండేసివిగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇకనైనా మేల్కోని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.