: విశాఖలో కావేరీ బస్సు దగ్ధం.. బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్న ప్రయాణికులు


విశాఖపట్టణంలోని పరవాడలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో ఆహుతైంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పరవాడ సమీపంలోకి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. వారు తప్పించుకున్న కాసేపటికే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఒక్కసారిగా మంటలు రావడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News