: రోజులు లెక్కపెట్టుకుంటున్న దావూద్.. కరాచీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై మాఫియా డాన్?
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడా? వెంటిలేటర్‌పై రోజులు లెక్కపెట్టుకుంటున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి అతడి సన్నిహిత వర్గాలు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్న దావూద్ ఈనెల 22న అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మెదడులో కణతి ఉందని గుర్తించిన వైద్యులు దానిని తొలగించేందుకు చేసిన ఆపరేషన్ వికటించడంతో అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నట్టు అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు దావూద్‌కు మూడు వారాల క్రితం పక్షవాతం వచ్చి కుడివైపు శరీరం మొత్తం చచ్చుబడి పోయిందని ఓ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ వార్తలను దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ ఖండించాడు. కాగా, దావూద్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలియడంతో భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.