: ‘ఇన్ స్టాగ్రామ్’లో కత్రినా కైఫ్.. ‘వెల్ కమ్’ పోస్ట్ పెట్టిన సల్మాన్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఇన్ స్టాగ్రామ్’లో తన ఖాతాను ఈరోజు ప్రారంభించింది. ‘ఇన్ స్టా గ్రామ్’లో చేరుతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. ‘ఇది సరికొత్త ప్రారంభం.. హలో ఇన్ స్టాగ్రామ్’ అని కత్రినా తన తొలి పోస్టు చేసింది. కాగా, అందుకు, వెల్ కమ్ చెబుతూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి పోస్ట్ చేయడం విశేషం. ‘ఇన్ స్టా గ్రామ్’లో తన ఖాతా ప్రారంభించిన ఒక్క రోజులోనే సుమారు తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్ ను కత్రినా సొంతం చేసుకుంది. కాగా, 2016 లో కత్రినా కైఫ్ తన ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించింది.