: బ్లాక్ లో టికెట్ల విక్రయం.. ‘బాహుబలి’ థియేటర్లపై పోలీసుల దాడులు!
సికింద్రాబాద్ లో ‘బాహుబలి-2’ చిత్రం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న థియేటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అల్వాల్, మచ్చబొల్లారంలోని థియేటర్ల వద్ద బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,440 నగదు, పద్నాలుగు టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.