: బాహుబలి టీ షర్ట్ ధరించి తర్వాతి షోలో బాహుబలి-2ను మరోసారి వీక్షిస్తా: మంచు మనోజ్


ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన సినిమా బాహుబలి: ది కన్‌క్లూజన్ ను సినీన‌టుడు మంచు మనోజ్ త‌న భార్య ప్ర‌ణ‌తితో క‌లిసి చూశాడ‌ట‌. హైద‌రాబాద్‌లోని ఐమాక్స్‌ నాలుగో స్కీన్‌పై బాహుబలిని చూసి ఎంజాయ్ చేసిన ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆనందం వ్య‌క్తం చేశాడు. బాహుబలి-2 సినిమా అద్భుతంగా ఉంద‌ని అన్నాడు.

ఈ సినిమాను తాను తర్వాతి షోలో మ‌రోసారి కూడా చూస్తానని చెప్పాడు. ఇప్పటికే బాహుబలి టీ షర్ట్ ధరించి మ‌రీ సినిమా చూసిన మ‌నోజ్‌.. తాను మ‌రోసారి బాహుబలి-2ను చూసేట‌ప్పుడు కూడా ఆ టీష‌ర్టే ధ‌రిస్తాన‌ని చెప్పాడు. మరో యంగ్ హీరో అల్లు శిరీష్ ఈ సినిమాపై స్పందిస్తూ.. మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉందని అన్నాడు. దర్శకుడు గుణశేఖర్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై ప్రశంసల జల్లు కురిపించాడు.  


  • Loading...

More Telugu News