: యూట్యూబ్ లో దూసుకుపోతున్న ప్రభాస్ కొత్త సినిమా టీజర్


ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెరకెక్కించిన బాహుబ‌లి సినిమా అనంత‌రం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్‌ని నిన్న‌ విడుదల చేయ‌గా కేవ‌లం 24 గంట‌ల్లోనే  రెండు మిలియన్ల (ఇరవై లక్షల) వ్యూస్ వ‌చ్చాయి.

500 ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థలా తెర‌కెక్కించిన 'బాహుబ‌లి' సీరీస్ లో ప్ర‌భాస్ అప్ప‌టి రాజులా ప్ర‌త్యేక‌మైన‌ గెట‌ప్‌లో క‌నిపించాడు. అయితే, 'సాహో'లో స‌రికొత్త గెట‌ప్‌లో ప్ర‌భాస్ కనపడుతుండడం అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ముఖంపై కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ 'ఇట్స్ షో టైం' అంటున్న ప్ర‌భాస్ డైలాగ్ కు అభిమానులంతా సాహో అంటున్నారు.

  • Loading...

More Telugu News