: అత్యంత విషమంగా విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితి?


కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గబ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడాది క్రితం మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే, ఇరవై రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. కాగా, విద్యాసాగర్ రావును పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ మొన్ననే ఆసుపత్రికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

  • Loading...

More Telugu News