: అనంతపురం ప్రమాద ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య.. చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఎర్రతిమ్మరాజు చెరువులో తెప్పలో 19 మంది వెళుతుండగా అది బోల్తా పడి విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కి పెరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీతతో ఆయన మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయని మంత్రి సునీత మీడియాతో చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు.