: అలాగైతే వాట్సప్‌ వాడడం మానేసేయండి: సుప్రీంకోర్టులో వాట్సప్ తరఫు న్యాయవాది


త‌మ యాప్‌లోని డేటాని ఫేస్‌బుక్‌తో షేర్‌చేస్తూ సరికొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశ పెట్టిన వాట్స‌ప్ పై ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. భార‌త అత్యున్నత న్యాయస్థానంలోనూ ఈ కేసుపై విచారణ కొన‌సాగుతోంది. అయితే, ఇందులో భాగంగా కోర్టులో వాట్స‌ప్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ... ప్రైవసీ పాలసీపై భయం, అనుమానం ఉన్న యూజ‌ర్లు ఆ యాప్‌ను వాడ‌డం మానేయ‌వ‌చ్చ‌ని అన్నారు.

మ‌రోవైపు ఫేస్‌బుక్ త‌ర‌ఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. వాట్సప్‌ ఇప్పటి వరకూ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ భద్రతని అందిస్తోందని, అంతకు మించి భద్రత అందించలేమని వాట్సప్ ప్ర‌తినిధులు చెబుతున్నార‌ని వాదించారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీతో ఇబ్బంది వ‌స్తుంద‌ని భావించే వారు ఆ సర్వీసులను వాడటం మానుకోవచ్చని అన్నారు. కాగా, పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదిస్తూ... ప్రాథ‌మిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ‍స‌ర్కారుపై ఉంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News