: మరో కేసులో లేడీ స్మగ్లర్ సంగీతను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు


ఎర్ర చందనం లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీపై ఇప్పటికే నమోదై ఉన్న మరో కేసులో ముందడుగు పడింది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి 2015లో యాదమర్రి పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-8 నిందితురాలిగా ఉన్న సంగీతను, నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న సంగీతను రేపు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం కేసుకు సంబంధించి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని సబ్ జైలులో సంగీత చటర్జీ రిమాండ్ లో ఉంది. కాగా, ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టనున్నారు.

  • Loading...

More Telugu News