: సత్తా చాటిన బాలికలు.. బస్సుకు తాడు కట్టి బయటకు లాక్కొచ్చిన వైనం!


మేము అబలలం కాదు సబలలమే అని నిరూపించారు కొంతమంది బాలికలు. ఓ పెద్ద బ‌స్సును లాగి తమ బ‌ల‌మెంతో చూపించి అంద‌రితో ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు మ‌ణిపూర్‌కి చెందిన కొంత‌మంది పాఠ‌శాల విద్యార్థినులు. వారంతా లోక్‌తక్‌ సరస్సుకు విజ్ఞానయాత్ర కోసం వెళ్లగా, మార్గమధ్యంలో వారి బ‌స్సు బుర‌ద‌లో చిక్కుకుపోయి ముందుకూ, వెన‌క‌కూ క‌ద‌ల‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ బ‌స్సును మేం బ‌య‌ట‌కు లాగుతాం అని చెప్పిన స‌ద‌రు బాలిక‌లు బస్సుకు తాడు కట్టి బయటకు లాక్కొచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చి వార్త‌ల్లోకెక్కింది. బాలికల శక్తి అంటే ఏంటో చూపించారని అంద‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.



  • Loading...

More Telugu News