: ప్రచారం కోసమే శిల్పాశెట్టిపై కేసు పెట్టారు: భర్త రాజ్ కుంద్రా


బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై మహారాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా స్పందిస్తూ, మీడియాలో ప్రచారం పొందేందుకే తన భార్య శిల్పాశెట్టిపై కేసు పెట్టారని, ఈ వ్యాపార లావాదేవీల్లో ఆమెకు ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు.

తమపై కేసు పెట్టిన ఓ టెక్స్ టైల్స్ సంస్థ యజమాని పలు చోట్ల తన పరిచయాలను దుర్వినియోగం చేశాడని అన్నారు. తాను మోసం చేయలేదని, సదరు టెక్స్ టైల్స్ యజమానితో చేసుకున్న వ్యాపార ఒప్పందం రద్దయిందని అన్నారు. కాగా, రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు తనకు రూ.24 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని ఓ టెక్స్ టైల్స్ సంస్థ యజమాని థానె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు నమోదైంది.  

  • Loading...

More Telugu News