: ఇసుక తవ్వకాలు చంద్రబాబుకు తెలియదనడం సరి కాదు: పురందేశ్వరి
ఇసుక తవ్వకాల గురించి తనకు తెలియదని సీఎం చంద్రబాబు అనడం సరికాదని, ఆయన తీసుకుంటున్న చర్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇసుక మాఫియా రోజు రోజుకీ రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని అన్నారు. ఒక వైపు ఉచిత ఇసుక ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మరో వైపు, లారీలతో ఇసుక అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.