: మాసిడోనియన్ పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లిన నిరసనకారులు..వంద మందికి గాయాలు!


మాసిడోనియా దేశ పార్లమెంటు భవనంపై జరిగిన దాడి ఘటనలో వంద మందికి పైగా గాయపడ్డారు. పార్లమెంట్ స్పీకర్ గా ఆల్బేనియన్ జాతీయుడు ఎన్నిక కావడంపై అసంతృప్తి ఉన్న కొందరు జాతీయ పతాకాలు చేతబూని, జాతీయ గీతం ఆలపిస్తూ పోలీసు వలయాన్ని ఛేదించుకుని నిన్న సాయంత్రం పార్లమెంట్ భవనం లోపలికి దూసుకువెళ్లారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేయడంతో పాటు, పది మంది ఎంపీలు, మీడియా సిబ్బందిని, పోలీసులను గాయపర్చారు. పార్లమెంట్ సభ్యుల్లో కొందరు చిరిగిన దుస్తులు, గాయాలతో పార్లమెంట్ బయటకు పరుగులు తీసినట్టు భద్రతా విభాగం అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనను యూరోపియన్ యూనియన్ సహా అగ్ర రాజ్యం అమెరికా కూడా ఖండించింది.

  • Loading...

More Telugu News