: ఫ్లైఓవర్‌ పై వెళుతున్న లారీ.. కింద రోడ్డుపై వెళుతున్న ఆటోపై పడింది!


ఫ్లైఓవర్‌ పై వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి కింద రోడ్డుపై వెళుతున్న ఆటోపై ప‌డిపోయిన ఘ‌ట‌న పంజాబ్‌లోని జలంధ‌ర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. లారీతోపాటు ఫ్లైఓవర్‌ శకలాలు కూడా విరిగి కింద‌ప‌డ‌డంతో పెద్దగా శ‌బ్దం వచ్చింది. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు లారీ, ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాద సమ‌యంలో ఆటో ప‌క్క‌నుంచే సైకిల్ పై వెళుతున్న ఓ వ్య‌క్తి తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. ఆ వ్య‌క్తి సైకిల్‌పై వెళుతుండ‌గా ఒక్క‌సారిగా పై నుంచి ఫ్లైఓవ‌ర్ శ‌క‌లాలు విరిగిప‌డుతుండ‌డం గ‌మ‌నించాడు. దీంతో సైకిల్ వదిలేసి దూరంగా ప‌రిగెత్తాడు.

  • Loading...

More Telugu News