: ఇసుక మాఫియాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు: సీఎం చంద్రబాబు


ఏర్పేడు ఘటన తర్వాత ఇసుక మాఫియాను అరికట్టే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక విధానంపై చర్చించేందుకు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మైనింగ్ శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, ఇసుక మాఫియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానం, అందులోని లోటు పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, హోమ్, విజిలెన్స్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News