: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది: మంచు లక్ష్మి సంబరం
'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినీ అభిమానులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాను ఆరాధించే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న రహస్యం తెలిసిపోయిందంటూ సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాని చూసిన నటి, నిర్మాత మంచు లక్ష్మి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన గ్యాంగ్‌తో కలిసి మొదటి రోజు మొదటి ఆట బాహుబలి-2 చూశానని చెప్పి, ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు ఉన్నారు. ఫైనల్‌గా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయిందని మంచు లక్ష్మి సంబరపడిపోయింది.
Finally here to find out with my gang, "Why did Katappa kill Baahubali?" on the First Day First Show of #Baahubali2! pic.twitter.com/PRO40bXPq0
— Lakshmi Manchu (@LakshmiManchu) 28 April 2017