: ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు...ఆ జట్టు కూడా నా కలల జట్టు కాదు: గంగూలీ ప్రకటన


టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 'కలల ఐపీఎల్ జట్టు' అంటూ రెండురోజుల క్రితం ఒక జట్టును ప్రకటించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించలేదు. దీంతో గంగూలీపై విమర్శలు వచ్చాయి. ఈ వార్తలను చూసిన గంగూలీ స్పందించారు. తాను ఎలాంటి కలల జట్టును ప్రకటించలేదని అన్నారు. అసలు ఆ ట్విట్టర్ అకౌంట్ తనది కాదని తెలిపారు. తాను కూడా ఆ ట్విట్టర్ అకౌంట్ ను ఇప్పుడే చూశానని చెప్పారు. తన పేరుతో ఉన్న ఐపీఎల్‌ ఫాంటసీ జట్టుని కూడా చూశానని ఆయన అన్నారు. అయితే ఆ ట్విట్టర్ అకౌంట్, ఆ కలల జట్టు రెండూ తనవి కాదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎలాంటి ఊహాలోకపు జట్ల ఆటల్లో పాల్గొనని, ఇది పూర్తిగా నకిలీదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News