: ఫేస్‌బుక్ లైవ్‌లో 'బాహుబలి-2'.. కువైట్ లో ఓ ప్రేక్షకుడి అత్యుత్సాహం!


ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన బాహుబ‌లి-2 సినిమా చూసిన సినీ అభిమానులు సాహోరే బాహుబ‌లి అంటూ కేరింత‌లు కొడుతున్న విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్‌లో ప‌లు సీన్లు లీకై పోయాయ‌ని వార్త‌లు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే, నిన్న రాత్రి కువైట్‌లో ఓ అభిమాని బాహుబ‌లి సినిమాను థియేట‌ర్ నుంచి ఏకంగా ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ద్వారా త‌న ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్ అంద‌రికీ చూపించేశాడు. ఈ వార్త అక్క‌డి స్థానిక ఛానళ్లలో ప్రసారం కావ‌డంతో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విజువ‌ల్స్‌ అస్పష్టంగా క‌నిపించిన‌ట్లు తెలుస్తోంది. బాహుబ‌లి స్టోరీతో పాటు వీడియోలు కూడా ఇలా సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌కు వస్తుండ‌డం బాహుబ‌లి యూనిట్‌ను ఆందోళ‌న‌కు గురిచేసే అంశ‌మే.

  • Loading...

More Telugu News