: నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమాల గురించి మాట్లాడే మగాడింకా పుట్టలేదు రాజమౌళి మామా!: నాని
సినీ అభిమానులు ఎవర్ని కదిపినా వినిపించేది ఒకటే మాట...'బాహుబలి-2: ద కన్ క్లూజన్'. సామాన్య ప్రేక్షకులే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటే, జీవితమే సినిమాలపై ఆదారపడిన నటీనటులు ఇంకెంత మాట్లాడాలి?... ఇప్పుడు తెలుగు సినీ నటులు అదే పనిలో ఉన్నారు. రాజమౌళి తీసిన 'ఈగ' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హీరో నాని బాహుబలి గురించి ఆసక్తిగా స్పందించాడు. ఇంతకీ నాని సోషల్ మీడియా ద్వారా ఏమన్నాడంటే... 'నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా' అన్నాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.