: మీ రెజ్యూమెలో ఈ 10 పదాలుంటే.. మీకు ఉద్యోగం రానట్టే!
ఏ ఉద్యోగానికైనా అన్నింటికన్నా ముఖ్యమైనది రెజ్యూమె. రెజ్యూమెని చూసిన వెంటనే అభ్యర్థికి సంబంధించి పూర్తి అంచనాకు వచ్చేస్తారు ఇంటర్వ్యూ చేసేవారు. ఈ రెజ్యూమెలను వేల సంఖ్యలో చూసిన నిపుణులు వీటికి సంబంధించి ఓ కీలక అంశాన్ని వెల్లడించారు. రెజ్యుమెను చూడగానే అభ్యర్థి గురించి 70 శాతం అంచనాకు వచ్చేస్తామని వారు చెబుతున్నారు. దాదాపు 80 శాతం మంది అభ్యర్థులను రెజ్యుమెను చూసే, తిరస్కరించేస్తున్నామని తెలిపారు.
కొన్ని పదాలను రెజ్యుమెలో కామన్ గా వాడుతుంటారని... ఈ పదాలను పదేపదే వాడే వారిలో ఆలోచించే గుణం లేదనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఇంటర్వ్యూ చేసేవారికి కూడా ఈ పదాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని అన్నారు. ఆ పదాలేంటో ఓసారి మీరూ చూడండి...
excellent, passionate, dynamic, strategic, expert, specialised, leadership, responsible, certified, experience.