: ఉత్తరాదికి విస్తరించిన హెరిటేజ్... ఇంట్రోలో అదరగొట్టిన బ్రాహ్మణి!


తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో సత్తాచాటిన హెరిటేజ్ ఉత్పత్తులు ఇకపై ఉత్తర భారత దేశాన్ని కూడా పలకరించనున్నాయి. ఉత్తరాదిలో హెరిటేజ్ ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ఈ సంస్థ ఢిల్లీలో ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న సమావేశంలో హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సంస్థ గురించి అద్భుతంగా వివరించారు. సంస్థ సాధించిన ఘనతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.

తమ సంస్థ లక్ష్యం హెల్త్ అండ్ హేపీనెస్ అని చెప్పారు. నవ్వుతో కూడిన పాల గ్లాసును ప్రతి ఇంటికి అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఆమె చెప్పారు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యం, ఆనందంలో భాగం కావాలని భావిస్తున్నామని ఆమె తెలిపారు. నాణ్యతే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. రోజూ 28 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని ఆమె తెలిపారు. వివిధ పాల ఉత్పత్తులను ఒక మిలియన్ అవుట్ లెట్స్ కు అందిస్తున్నామని ఆమె తెలిపారు. 

  • Loading...

More Telugu News