: రాహుల్ ఎక్కడో ఉంటే సరిపోదు: షీలా దీక్షిత్


త్వరలోనే సోనియాగాంధీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధినేతగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొంచెం అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడో గడిపితే సరిపోదని... పార్టీ కార్యాలయంలో అందరికీ అనునిత్యం కొన్ని గంటలైనా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.

19 ఏళ్ల క్రితం సోనియాగాంధీ పార్టీ పగ్గాలను చేపట్టినప్పుడు ప్రతి రోజు ఉదయం కనీసం రెండు మూడు గంటలు పార్టీ కార్యాలయంలో గడిపేవారని... ఇప్పుడు రాహుల్ కూడా ఇదే చేయాలని ఆమె అన్నారు. లేకపోతే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అయితే, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని... వాటిలో కొన్ని ఆయనకు వారసత్వంగా సంక్రమించాయని చెప్పారు. ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి, కొన్ని గంటల పాటు పార్టీ వర్కర్స్ తో గడిపితే అంతా సర్దుకుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News