: రాబర్ట్ వాద్రా ఆర్థిక లావాదేవీలతో నాకు సంబంధం లేదు: ప్రియాంకా గాంధీ


తన భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక లావాదేవీలతో కాని, ఆయన కంపెనీలతో కాని తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు రియలెస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ తో ఉన్న భూ లావాదేవీలపై హర్యాణా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంకా ఈ వ్యాఖ్యలు చేసింది.

హర్యాణాలోని ఫరీదాబాద్ లో 2006లో ప్రియాంకా గాంధీ 5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 15 లక్షలకు కొన్నారు. ఆ తర్వాత అదే యజమానికి ఆ భూమిని 2010లో రూ. 80 లక్షలకు (అప్పటి మార్కెట్ విలువ) అమ్మినట్టు ఆమె తెలిపారు. ఈ డబ్బును కూడా కేవలం చెక్ ద్వారానే తీసుకున్నానని చెప్పారు. అయితే, ఈ భూమిని ఆమె భర్తే కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ప్రియాంక, అవన్నీ నిరాధారమైన వార్తలంటూ కొట్టి పారేశారు.

  • Loading...

More Telugu News