: నెంబర్ వన్, స్టార్, ఇమేజ్ వంటి పదాలు వినడానికి బాగుంటాయి... తలెగరేస్తే మాత్రం అంతే సంగతులు: రకుల్ ప్రీత్ సింగ్


నెంబర్ వన్, స్టార్‌, ఇమేజ్‌ వంటి మాటలు వినసొంపుగా ఉంటాయని టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఆయితే ఈ పదాలను విని గర్వం నెత్తికెక్కితే మాత్రం కథ ముగిసిపోతుందని అభిప్రాయపడింది. మహేష్ బాబు సరసన ‘స్పైడర్‌’ సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి 'స్టార్ హీరోయిన్' అంటూ పొగిడే మాటల్ని పట్టించుకోకూడదని తెలిపింది. అలాంటి మాటలన్నీ వూరికే చెప్పే మాటలని తీసి పడేసింది.

ప్రతి ఒక్కరిలోనూ ఉన్నట్టే తనలో కూడా బలహీనతలు ఉన్నాయని చెప్పింది. తన ఖాతాలో కూడా పరాజయాలు ఉన్నాయని తెలిపింది. విజయాలకు పొంగిపోతే...పరిజయాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని అంది. పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో... ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని, తనలో స్టార్ డమ్, ఇమేజ్, నంబర్ గేమ్ వంటివి మార్పులు తేలేదని తెలిపింది. తాను ఆకాశంలో విహరిస్తున్నా...తన కాళ్లు మాత్రం భూమిమీదే ఉన్నాయని రకుల్ పేర్కొంది. 

  • Loading...

More Telugu News