: బాహుబలి ప్రభంజనం.. వారం రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయ్!


ఇరు తెలుగు రాష్ట్రాలు 'సాహో బాహుబలి' అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లలో ఈ సినిమానే ఆడుతోంది. టికెట్ల కోసం థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో... మేనియా మరింత ఎక్కువైంది. వారం రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ పూర్తయిపోయాయని తెలుస్తోంది.

మరోవైపు, థియేటర్ల వద్ద 'బ్లాక్' వీరులు విజృంభిస్తున్నారు. టికెట్ల రేట్లను కొన్ని రెట్లు పెంచేసి... వచ్చిన కాడికి దండుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా కళ్ల ముందే కనబడుతున్నా... పోలీసులు మాత్రం ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. టికెట్ల కోసం ప్రతి థియేటర్ వద్ద చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

  • Loading...

More Telugu News