: తొలిసారి శాంతి మంత్రం జపించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సైనిక చర్యలకు గాని, బాంబు దాడులకు గాని ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. కానీ, తొలిసారి ఆయన శాంతి మంత్రం జపించారు. అణుకార్యక్రమం విషయంలో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ప్రతిష్టంభన నెలకొంటుందని తెలిపిన ఆయన... ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. దీనికి దౌత్య మార్గమే సరైన పరిష్కారమని తెలిపారు. ఉత్తర కొరియాతో ఉన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అవకాశాలున్నాయని ఆయన అన్నారు. తానైతే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నానని చెప్పారు. ఇకపై తాము సైనికపరమైన చర్యలతో ముందుకు వెళ్లకుండా... ఆర్థిక కార్యక్రమాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే, ఇది కొంచెం క్లిష్టతరమైందని అన్నారు.