: హైదరాబాదులో 5 కోట్ల కారు ఎవరిదో తెలుసా?


హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం బయట 5 కోట్ల రూపాయల విలువైన ఫెరారీ కారు కనువిందు చేసింది. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయం లోపలికి దీనిని తీసుకువెళ్ళే వీలులేకపోవడంతో రోడ్డు మీద ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడే ఈ కారుకు ఎంవీఐ చంద్రశేఖర్‌ రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. 5 కోట్ల రూపాయల విలువైన ఈ కారు కోసం నచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ను లక్షా 93 వేల రూపాయలు వెచ్చించి, వేలంలో పొందడం జరిగింది. ఈ కారును నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 

  • Loading...

More Telugu News