: జ్యుడీషియల్ కస్టడీలోకి ఉత్తరాఖండ్ ఈవీఎంలు.. హైకోర్టు ఆదేశం
ఉత్తరాఖండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ ఆ రాష్ట్ర హైకోర్టులో కాంగ్రెస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని, ఏ బటన్ నొక్కినా ఓటు బీజేపీ ఖాతాలోకే వెళ్తోందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే ఆమ్ ఆద్మీ, బీఎస్పీలు కూడా చేస్తున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.