: ఆ విషయంపై మాట్లాడకుండా ఉంటే.. నవాజ్ షరీఫ్ రూ.1000 కోట్లు ఇస్తానన్నారు: ఇమ్రాన్ ఖాన్


ప‌నామా పేపర్లు బ‌య‌ట‌పెట్టిన అక్రమార్కుల జాబితాలో పాకిస్థాన్ ప్ర‌ధానమంత్రి న‌వాజ్ ష‌రీఫ్ పేరుంద‌ని, ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని ఆ దేశ‌ ప్రతిపక్ష పార్టీ తెహ్రెక్-ఇ-ఇన్‌సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్ డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ష‌రీఫ్‌పై ఈ రోజు ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను ప‌నామా విష‌యంపై మాట్లాడ‌కుండా ఉంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తానని న‌వాజ్ ష‌రీఫ్‌ ఆశ‌ చూపించార‌ని ఆయ‌న అన్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి స్నేహితుడయిన ఒకరు రెండు వారాల క్రితం తనను కలసి ఈ విషయంపై మాట్లాడార‌ని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఈ వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్‌ మాత్రమేకాక, షరీఫ్‌ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తే మున్ముందు మ‌రింత ఇస్తామ‌ని షరీఫ్ ఆ వ్యక్తితో తనకు చెప్పించార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే, ఇమ్రాన్ అన్నీ అవాస్త‌వాలు మాట్లాడుతున్నార‌ని పంజాబ్ సీఎం షాబాజ్‌ షరీఫ్ అన్నారు. తాను ఈ విషయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News